Description
₹120. శూద్రులను పాదాల నుంచి పుట్టినవారని చెప్పిన శ్లోకానికి పైన విశ్వం పుట్టుకను కూడా వేదం చెబుతోంది. మహాపురుషుడి బుద్ది నుంచి చంద్రుడు, కంటి నుంచి సూర్యుడు, నోటి నుంచి ఇందగరాగ్నులు, ఊపిరి నుంచి వాయువు, నాభి నుంచి అంతరిక్షం పుడితే, భూమి మాత్రం అతని పాదాల నుంచి ఆవిర్భవించిందట. దేవలోకాల ముందు భూలోకం అధమమే. పాదాలకు ఎప్పుడూ అధమస్థానమే, అధములకే పాదాల స్థానం. అధికారాన్ని శిరస్సుతో స్వీకరిస్తారు, లొంగుబాటును పాదాలతో అంగీకరిస్తారు. కవిత్వం కూడా అంతే.విశ్లేషణ, విమర్శ, సిద్దాంతం వంటి వన్నీ కూడా కవులకు తెలియనివేమి కావు కానీ, కవిత్వం ఒక భిన్నమయన యానకం. అది హృదయం నుంచి హృదయానికి, ఉద్వేగం నుంచి ఉద్వేగానికి హాట్ లైన్ వంటిది. మూలుగులు, ఆర్తనా్అలు, ఆక్రందనలు, నిట్టూర్పు లు, విరక్తులు, శపథాలు, సత్యప్రకటనలు అన్నీ ఈ కవితల్లో అందుకే వినిపిస్తాయి.ఈ పుస్తకం కొరకు నవతెలంగాణ బుక్ స్టాల్స్ లను సంప్రదించవలసిన అడ్రెస్:-
కరీంనగర్:- 8897430904.
Reviews
There are no reviews yet.