గాంధీజీ హంతకుడు.గాడ్సే జీవితం

300.00

ఆ ఏడాది, అంటే 1947 ముగిసే నాటికి గాడ్సేకు తన జీవితం గురించి సమగ్ర ప్రణాళిక అంటూ ఏదీ లేదు. అతనికి జర్నలిజం వృత్తి వల్ల మగత ఏర్పడేది. పత్రిక ఇంకో నెల నడవాలి. రెచ్చగొట్టే తన వ్యాసాలు ఇంకెన్నో ముద్రించాల్సి ఉందని అతను అనుకొన్నాడు. అయినా పత్రికపై అతనికి ఆసక్తి తగ్గిపోయింది. ఆ మానసిక అల్లకల్లోల దశలో కూడా అతనికి ఒక అస్పష్టమైన దిశ ఉండేది. అదేమిటంటే ఏదైనా ఒక పెద్ద సంఘటన జరగాలి. దేశాన్ని కుదిపేయాలి, కాని ఏమి జరగాలి? ఆ స్పష్టత లేదు.
డిసెంబర్ నెల ముగింపునకు రాక ముందే భవిష్యత్ కార్యాచరణ గురించి, ఆప్టేతో గాడ్సె అనేకసార్లు సుదీర్ఘ సంభాషణలు జరిపాడు. ‘ ఆ చర్చల్లోనే గాంధీజీని చంపాలన్న ప్రతిపాదన వచ్చింది. గాడ్సేకు అది కొత్తగా కలిగిన ఆలోచన కాదు. “స్వాతంత్య్రం రావడానికి కొన్నివారాల ముందే, అంటే అప్పటికి ఐదు నెలలకు ముందే ఆ విషయం చర్చించుకొన్నారు. శివాజీ మందిర్లో జరిగిన హిందూ కార్యకర్తల సమావేశంలో ఉన్న కొందరు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు హిందువుల దేశం నిర్మించడానికి గాంధీ, నెహ్రూలు ఆటంకంగా ఉన్నారని, వారిద్దరినీ లేకుండా చేయాలని చెప్పినట్లు గాడ్సె తెలిపాడు. గజానన్ నారాయణ్ క్రాంతికార్ అనే గాంధీ అభిమాని ఇచ్చిన సమాచారం ప్రకారం శివమందిరంలో ఆప్టే అధ్యక్షతన జూలైలో సమావేశం జరిగింది. అందులో గాడ్సె ప్రసంగించాడు.” “అతను (గాడ్సె) కూడా కొందరు ఆర్ఎస్ఎస్ వారి అభిప్రాయాన్ని సమావేశంలో చెప్తూ, హిందువుల దేశం నిర్మించాలంటే గాంధీ, నెహ్రులు ముళ్లకంచెలా అడ్డుగా ఉన్నారు, కనుక వారిని తొలగించాలని చెప్పినట్లు ణతెలిపారు”. క్రాంతికార్ వెంటనే ఆ విషయాన్ని అప్పటి బొంబాయి ప్రావిన్సు ముఖ్యమంత్రి బి.జి. ఖేర్కు జులై 23, 1947లో ఒక లేఖ ద్వారా తెలిపారు. అంటే గాంధీజీ హత్యకు ఆరు నెలల ముందన్నమాట.
దేశ విభజన వల్ల ఏర్పడిన గందరగోళం మధ్య దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో గాడ్సే, ఆస్టేలు జిన్నా హత్యకు, అలాగే పాకిస్తాన్ కీలక సంస్థలపై దాడికి ప్రణాళికలు వేస్తున్నారు. అది వారి తలకెక్కింది. తమ పథకాల గురించి ప్రగల్భాలు పలుకుతున్నారు. వాటి కోసం ఆయుధాలను సేకరించారు. అయినప్పటికీ తమ పథకాన్ని అమలు చేయలేక పోయారు. అందులో గాడ్సెకు చెప్పదగిన పాత్ర లేదు. అయినప్పటికీ తాను కూడా ఆ వైఫల్యంలో భాగమని భావించి బాధపడ్తున్నాడు. చాలాకాలం నుండి దాచి పెట్టుకొని ఉన్న డిప్రెషన్ నుండి, స్వీయ అజ్ఞాత నుండి అతని తృష్ణ బయటకొచ్చింది. స్వాతంత్య్రానికి ముందు తాను పక్కకు పెట్టిన ఆలోచన మళ్లీ పైకి తోసుకొచ్చింది.
గాంధీజీని ఎవరు చంపాలి? అనే ప్రశ్న మాత్రమే వారికి మిగిలింది. ఆ చర్చ సందర్భంగా ఆప్టే తెలివిగా తప్పుకొనేవాడు. గాడ్సె ఆ పని చేయడానికి ధైర్యం కూడదీసుకోలేక పోయాడు. ఆ సమయంలో అతను వీర మరణానికి సిద్ధంగాలేడు. ఎవరైనా అందుకు సిద్ధపడితే అందులో పాత్ర వహించాలనుకొన్నాడు. గాడ్సే ది విస్మయపరిచే అంతరంగం కాదు. అతని యవ్వన దశంతా సాహస కృత్యాలు కేవలం మాట్లాడటం తోనే గడిచింది. జిన్నాకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా అప్లై పథకాలు సిద్ధం చేస్తున్నపుడు కూడ ఆ ప్రతిపాదనలను అంగీకరించాడు తప్ప అందులో పాత్ర వహించలేదు. గాడ్సె తనను తాను హిందువుల సంరక్షకుడని చెప్పుకొంటాడు. కాని తాను హత్య చేయడానికి సిద్ధంగా లేడు. హింసను ప్రయోగించడం పట్ల అతని ఆలోచనలు చాలా తీవ్రమైనవి. ఆయన ఉపన్యాసాలు, రాతలు భీతికొల్పేవిగా ఉండేవి. ఈ విషయంలో అతన్ని మించిన హిందూ మతోన్మాది పూనాలోనే లేరు. కాని గాంధీజీ హత్య వేరు, ఆ పని కవ్వింపు ఉపన్యాసాలు చేయడం, అడ్డగోలు రచనలు చేయడం లాంటిది కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ సమయంలో గాడ్సె అంతటి ధైర్యం చూపలేదు..
జనవరి 2, 1948లో ఆ సమస్య పరిష్కారమైంది. ఆరోజు గాడ్సే, ఆస్టేలు అహ్మద్నగర్ వెళ్లారు. కర్క రీను కలిసి ఆ విషయం మాట్లాడడానికి వెళ్లారు. కర్క రే ఇంటి దాబాపై గల చిన్న గదిలో హత్య ఎవరు చేయాలో నిర్ణయం చేశారు. తన విధానాలను గాంధీ ధృక్కోణం ప్రకారం మార్చేస్తోందంటూ కర్కరే ఆ రహస్య సమావేశంలో అన్నాడు. మనం ఏం చేసినా ముస్లింల పట్ల గాంధీజీ తీరులో ఏ మార్పు రాదు. కనుక ఆయనను లేపేయక తప్పదు అని గాడ్సే చెప్పాడు. ఆప్టే.
నేను ఆ అభిప్రాయంతో ఏకీభవించాం. అందుకు అవసరమైన సాయం చేస్తానని తాను చెప్పినట్లు కర్కరే తెలిపాడు.
గాంధీజీని ఎవరు చంపాలన్న ప్రశ్న రాగానే కర్కరే దానికి పరిష్కారం సూచించాడు. ఒక యువ శరణార్థిని అతను గాడ్సె, ఆప్టేలకు పరిచయం చేశాడు. “అతను తన కుటుంబమంతటి నుండి దూరమయ్యాడు. నా దగ్గర ఓ రెండు వారాల నుండి ఉంటున్నాడు. ఎంతటి సాహస కృత్యాన్నయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు” అని కర్కరే చెప్పాడు. గది నుండి బయటకు వచ్చి అతన్ని తీసుకొని సమావేశ గదిలోకి వెంటనే తిరిగి వెళ్లాడు. ఇతను శరణార్ధి, పేరు మదన్ లాల్ (పాహ్వా) అని గాడ్సె, ఆప్టేలకు పరిచయం చేశాడు. ”
దాంతో గాడ్సె తన చివరి అంశం లోకి అడుగు పెట్టాడు.
ఇరవై ఏళ్ల పాహ్వా పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్ధి.
తనపై విరుచుకుపడిన దుర్దశపై అతను మండిపడ్తున్నాడు. చాలామంది శరణార్ధుల్లాగే అతను కూడా తన దుస్థితికి వ్యక్తిగతంగా గాంధీజీనే కారణమని అనుకొంటున్నాడు. అతను 1927లో పుట్టాడు. పశ్చిమ పంజాబ్లోని మాంహో గోమరీ జిల్లా కేంద్రంలో పెరిగాడు. 1944లో మెట్రిక్యులేషన్ పరీక్షలు రాయబోతాడనగా స్కూల్ విడిచి రాయల్ ఇండియన్ నేవీలో చేరడానికి లాహోరు పారిపోయాడు. అతన్ని మొదట నేవీ బొంబాయికి శిక్షణ కోసం పంపింది. నెల తర్వాత నిర్వహించిన పరీక్షలో అతను తప్పిపోయాడు. దాంతో అతన్ని నేవీ నుండి తొలగించారు. ఆ తర్వాత పూనాకు వచ్చి బ్రిటిష్ ఇండియా ఆర్మీలో చేరాడు. స్వల్ప శిక్షణ తర్వాత తిరిగి లాహోరుకు పంపారు. యుద్ధ చర్యల్లో భాగంగా చేసిన తాత్కాలిక నియామం అది. 1946లో ఉద్యోగం నుండి తొలగించాక తిరిగి పాక్ పట్టణానికి వెళ్లి పోయాడు. తన మేనత్త దగ్గర ఉండేవాడు. అక్కడి నుండి ఖాళీ చేసి ఇండియాకు ఆగస్టు మూడవ వారంలో వచ్చేశాడు.
దేశ విభజన జరిగిన తర్వాత పాహ్వా పంజాబ్ నుంచి గ్వాలియరుకొచ్చి చివరికి అక్టోబర్లో బొంబాయికి చేరాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ప్రొ॥ జగదీష్ చంద్రజైన్ (రాంనారాయణ్ రుయా ఆటానమస్ కళాశాల) సహాయంతో ఇంటింటికీ తిరిగి పుస్తకాలు అమ్మే పనిలో కుదిరాడు. అతని కఠిన శ్రమ, అతనిలోని ఆకర్షణ వల్ల కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఒకరైన, మధ్య వయస్కురాలు శ్రీమతి మధోక్ అతనికి సాయం చేసింది. దాంతో అతను పండ్ల వ్యాపారిగా మారాడు. అందుకోసం అహ్మద్నగర్కు మకాం మార్చాడు. అక్కడ కర్కరేను కలిశాడు. కర్కరే అతనికి కొబ్బరి కాయల దుకాణం పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. ప్రొ॥జైన్, శ్రీమతి మధోక్ు అతన్ని బొంబాయిలోనే ఉండమన్నారు. కాని కర్కరే హామీతో పాహ్వా సందిగ్ధంలో పడ్డాడు. కొంతకాలం తర్వాత బొంబాయి వెళ్లినా అక్కడ ఆశించిన విజయం కన్పించలేదు. దాంతో డిసెంబర్ మధ్యలో అహ్మద్నగర్ తిరిగొచ్చాడు. *

కర్కరే మొదట్లో పాహ్వాకు మరో పని అప్పగించాలని అనుకొన్నాడు. పాహ్వాకు దక్కన్ అతిధి గృహంలో భోజనం చేయమని చెప్పి రాత్రిపూట హిందూ మహాసభ ఆఫీసులో పడుకొనే ఏర్పాటు చేశాడు. అహ్మద్ నగర్ దగ్గర్లో ఉంటున్న శరణార్థులను సమీకరించమని మొదట పాహ్వాకు చెప్పాడు కర్కరే. ఆ తర్వాత స్థానిక ముస్లిం హాకర్లను, దుకాణాదారులను వేధించడానికి అతన్ని వాడుకొన్నాడు. వారి నివాసాలపై బాంబులు వేయించేవాడు. హిందూ మహాసభను వ్యతిరేకించే ముస్లింల సభలను భగ్నం చేయించేవాడు. తన రోజువారీ ఖర్చులను కూడా కర్కరేనే చూసుకోవడంతో కర్కరేపై పాహ్వా పూర్తిగా ఆధారపడ్డాడు. పాహ్వా తన స్నేహితుల ముందు దర్పంతో కట్టుకథలు చెప్పి తన గురించి గొప్పలు పోయేవాడు. అతనిలో పాఠశాల రౌడీ లక్షణాలుండేవి. అహ్మద్ నగర్లో అతను ఓ వింతమనిషిలా కన్పించేవాడు.
అహ్మద్నగర్ తో అతని అనుబంధం పెరగడానికి మరో కారణం కూడా అందింది. అతనికి పాటలు పాడే ఒక పిల్లతో పరిచయం ఏర్పడింది. ఆమె అందం గురించి నలుగురూ చెప్పుకొంటారు కూడా. “డిసెంబర్ 25న చిత్ర టాకీసులో ఒక సినిమా చూశాక. సాయంత్రం గం. 6.30 ప్రాంతంలో నేను చాబ్బు అనే స్నేహితుడిని కలిశాను. పూనాలో మిలటరి శిక్షణ సందర్భంగా అతనితో పరిచయం. మేము అమ్మాయిల గురించి మాట్లాడుకొన్నాం. అలా నడుస్తూ నడుస్తూ అతను నన్ను ఒక పాటలు పాడే పిల్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ శేవంతి అనే అమ్మాయి అతనికి తెలుసు. ఆ రోజు ఆమె ఇంట్లో లేదు. ఓ రెండు రోజుల తర్వాత నేను మళ్లీ ఆ ఇంటికి వెళ్లాను. ఆమె అందం గురించి చాబ్బు చేసిన వర్ణన నన్ను అక్కడికి తీసుకెళ్లింది. డిసెంబర్ 27 రాత్రి నేను శేవంతి ఇంటికి వెళ్లాను. ఆమెను కలిశాను. ఇద్దరం స్నేహితులమయ్యాం”” అని పాహ్వా చెప్పాడు. ఆ తర్వాత అతను ప్రతి సాయంత్రం అక్కడికి వెళ్లడం మొదలెట్టాడు.
పాహ్వా కలిసినప్పుడు శేవంతి వయస్సు 17 ఏళ్లు. ఆమెకు వాళ్ల అమ్మ నుండి అందం వారసత్వంగా వచ్చింది. అమ్మ ఒక వేశ్య. చిత్ర టాకీసు సమీపంలోని వేశ్యవాడ భగత్ గల్లీలో ఉంటుంది. శేవంతి ఐదడుగుల కంటే కాస్త ఎక్కువ పొడవు. దట్టమైన పొడుగాటి జుట్టు. ముంగురులు మోహం మీద పర్చుకొని ఉంటాయి. చాలా ఆవేశం గల అమ్మాయి. వేశ్యా ప్రపంచం నుండి విముక్తి కోసం కలలు గంటోంది. వేశ్యా వృత్తిని చేపట్టమని ఆమె తల్లి రెండేళ్లుగా వెంటబడినా ప్రతిఘటిస్తోంది. ఏదో ఒకరోజు తను ఇష్టపడే వ్యక్తి తన జీవితంలోకి వచ్చి ఆ దుర్భర ప్రపంచం నుండి తనను బయటికి తీసుకెళ్తాడని, మర్యాద పూర్వక జీవితం కల్పిస్తాడని తల్లితో వాదిస్తుంది. తల్లి ఒక నవ్వు నవ్వు వదిలేస్తుంది.
పాహ్వాలో ఆమెకు తన పట్ల నిజమైన ప్రేమ కన్పించింది. అతను తనను అక్కడి నుండి తీసుకెళ్తాడనిపించింది. అతను ఇంతకు ముందెన్నడూ ఆమె దగ్గరలేని బహుమతులు ఇచ్చేవాడు. ” అయినా పాహ్వా ఎప్పుడు సంతులనం కోల్పోలేదు. అతను తన ప్రియురాలికి, యజమానికి సేవ చేయడం నేర్చాడు. శేవంతికి తాను కర్కరే గురించి విన్న దాన్ని బట్టి అతని పట్ల సద్భావం లేదు. అతను ముస్లింలపై దాడికి పురమాయిస్తుంటాడని ఏదో ఒక రోజున పాహ్వా కష్టాల్లో చిక్కుకోవచ్చని ఆది. నీ బెదిరింపులకు జడిసే ప్రజలు నీకు గౌరవం ఇస్తున్నారని నీకు అర్ధం కావడం లేదా? అని ఒక రోజు ఆమె పాహ్వాను ప్రశ్నించింది. అతను నవ్వేసేవాడు. తను అంత ప్రముఖుడైనందుకు అతను సంతోషపడేవాడని సుమన్బాయి
గాడ్సే, ఆప్టేలకు పాహ్వాను పరిచయం చేయడానికి ఒక రోజు ముందు అంటే 1948 జనవరి 1న పోలీసులు దక్కన్ అతిథి గృహంపై దాడి చేశారు.

Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “గాంధీజీ హంతకుడు.గాడ్సే జీవితం”

Your email address will not be published. Required fields are marked *