Description
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఒక ప్రజాస్వామిక అద్భుతం. ఆత్మ త్యాగాలతో సకల జన సాహస కార్యచరణతో సాధించుకున్న కొత్త చూపుతో కొత్త రేవును నిర్మించాలనుకున్న స్వప్నం, దాని ఫలాలను,ఫలితాలను పండించి పంచవలసిన పాలనలో ఆలన లాలన లేకపోయింది. ఒక ఎండమావి పరిహాసించింది ఆకాంక్షలు ఆశాబంగాలయ్యాయి. స్వయంపాలన సాధికారతను ఇస్తుందని ప్రజలకు భాగస్వామ్యంతో పరిపాలన పరిమళిస్తుందని ఉద్యమించి సాధించుకున్న విజయంలో హక్కులు స్వేచ్ఛ వికసిస్తాయని కన్న కలలన్నీ విరిగిపోయాయి. అదొక విషాద ప్రయాణం ఆత్మగౌరవ నినాదంతో ఎలుగెత్తిన ప్రజలు అహంకారం ముందు అవమానపడ్డారు. దొర తనాలను కూల్చిన సమాజంలో కొత్త గడీలు మొలిచాయి ఒక ధర్మ గంట కోసం జనం అలమట్టించవలసి వచ్చింది.అర్ధనాదాలు ఇతవులు అరణ్య రోదనలు అయ్యాయి.చివరకు తెలంగాణ తనతో నడిచి తనను నడిపించిన పార్టీని అధికారం నుంచి తప్పించే నిర్ణయం తీసుకోక తప్పలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఆశలు ఉంటాయి కొన్ని నెరవేర్చవచ్చు. అలాంటి ఘటనలను ఈ పుస్తకం చెపుతుంది..
Reviews
There are no reviews yet.