Description
నియంత అంతం – – ఆకార్ పటేల్
రాజకీయ ఊహాచిత్రానికి నవలా రూపం
తెలుగు అనువాదం: ఎన్ . వేణుగోపాల్
ప్రచురణ : మలుపు బుక్స్
వెల : 250/- పేజీలు : 232
ఇది మన ప్రభుత్వ పనితీరు మీద నవలారూప విమర్శ, రాజకీయ ఊహాచిత్రానికి నవలా రూపం.
ఇంకా నిర్మాణం కూడ పూర్తి కాని ఒక ఆస్పత్రిని అప్పటి కప్పుడు ముందువైపు మాత్రం ముస్తాబు చేసి ప్రారంభోత్సవం చేయడానికి ‘పెద్దాయన’ వస్తున్న సన్నివేశంతో నవల మొదలవుతుంది.
కెమెరాల ఏర్పాట్లు,ఏ కోణంలో అయితే పెద్దాయన బాగా కనబడతాడో ఏర్పాట్లు చేయడం, అలంకారాలు, భజనలు, స్వోత్కర్ష వంటి అనేక సూచనలు ఆయన ఎవరో పాఠకులకు స్పష్టంగానే తెలియజేస్తాయి.
ఆయన తన గొప్పలు చెప్పుకునే,తన కంటే ముందు వారిని తూలనాడే ఉపన్యాసం చేసి,ఆస్పత్రిని ప్రారంభించడానికి రిమోట్ నొక్కి,వేదిక దిగి,ఆస్పత్రి వైపు అడుగులు వేస్తూ కుప్పకూలి అక్కడికక్కడే మరణిస్తాడు.
సర్వస్వం తానే అయిన పెద్దాయన అలా అర్ధాంతరంగా చనిపోతే ఆ తర్వాత ఏమవుతుంది అనేది ఈ నవల ఇతివృత్తం.
పెద్దాయనకు కుడిభుజంగా ఉండిన జయేష్ భాయికీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్వామీజీకీ అధికారం కోసం కుమ్ములాట మొదలవుతుంది. ఆ కుమ్ములాట ముగిసే లోగా తాత్కాలిక ఏర్పాటుగా ఒక మహిళ అధికార పీఠం ఎక్కుతుంది.
ఆ క్రమంలో పెద్దమనిషి అధికారంలో ఉన్నరోజుల్లో ఆయన చేసిన పనులూ,ప్రవర్తనా,ఆయన మాటలూ అన్నీ మళ్లీ మళ్లీ పునశ్చరణకు వస్తూ ఒక గణతంత్ర రాజ్యపు ప్రధాన మంత్రి కార్యాలయం,దానికి అనుబంధంగా గృహ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎట్లా పని చేశాయో సంచలనాత్మక, దిగ్భ్రాంతికర, జుగుప్సాకర వాస్తవాల కంకాళాలెన్నో బైటపడతాయి.
ప్రజల కోసం,ముఖ్యంగా ఆదివాసుల కోసం మేలైన పని ఏదైనా చేయాలని తాత్కాలిక,మధ్యంతర ప్రధానమంత్రి అతి చిన్న ప్రయత్నం ప్రారంభిస్తే వ్యవస్థను యథాతథంగా కాపాడే శక్తులు ఆ ప్రయత్నాన్ని ఎట్లా అడ్డుకుని ఆమె పదవి ఊడగొడతాయో తర్వాతి పరిణామాలు చూపుతాయి.
జర్నలిస్టు రచనలకూ,రాజకీయ,ఆర్థిక విషయాల విశ్లేషణకూ, అనువాదానికీ ప్రఖ్యాతి పొందిన పత్రికా రచయితలు సృజనాత్మక రచనలు, అందులోనూ నవల వంటి ప్రక్రియ చేపట్టి అంతే సులువుగా,అంతే ఆసక్తికరంగా, కళాత్మకంగా రాయడం అసాధ్యం కాదు గాని అరుదు. సమకాలీన రాజకీయ అంశం తీసుకుని నవలా రూపంలో అద్భుతంగా చిత్రించి అటువంటి అరుదైన విజయం సాధించారు ఆకార్ పటేల్.
Reviews
There are no reviews yet.