నేనెందుకు హిందువుగా కాకుండా పోయాను

300.00

 

Category:

Description

47. లవ్ జిహాద్ – థాయ్ ఆఖర్ ప్రేమ్ కా

 

 

నేను ఆర్యసియస్ శాఖకు క్రమం తప్పకుండా వెళ్ళే రోజుల్లో అక్కడ ముస్లిమ్ల పట్ల విద్వేషాన్ని ఎలా నూరిపోసేవారో నాకింకా బాగా గుర్తు. ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం మగమనిషి జీవితంలో ఒక్కసారయినా హిందూ మహిళను శారీరకంగా అనుభవించి తీరాలని కంకణం కట్టుకుని ఉంటారు. అలా చెయ్యడం మూలంగా వాళ్ళకు స్వర్గంలో బహుమానం లభిస్తుంది. (సవాబ్) అని నమ్ముతారు. ఆ నమ్మకం మూలంగానే వాళ్ళు ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడతారు. ముస్లిమ్ల మూలంగా మన హిందూ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని శాకలో చెప్పేవాళ్ళు.

మొదట్లో ఈ మాటలు నేను నమ్మలేకపోయేవాణ్ణి. కానీ ఒకే విషయాన్ని పదే పదే చెవిన నూరిపోసేసరికి అదే నిజమై ఉంటుందని నమ్మాను. ‘మీరు స్కూల్లోనో, కాలేజీలోనో చదువుకునే ముస్లి విద్యార్థులను చూడండి. వాళ్ళకు చదువు మీద కన్నా హిందూ ఆడపిల్లల్ని ఆకర్షించడం మీద శ్రద్ధ ఎక్కువ ‘అని శాఖలో’ చెప్పేవాళ్ళు. యుక్తవయసులో అలాంటి ఆకర్షణలకు లోనయిన వాళ్ళని చూసి శాఖలో చెప్పేవే నిజం అయి ఉంటుందని భ్రమిస్తాను.

దాంతో నీ ప్రాపంచిక దృక్పధమే మారిపోయింది. ఏ ముస్లిం కుర్రాణ్ణి చూసినా శాఖలో చెప్పినట్లు వీడు ‘లవ్ జిహాద్’ ప్రాజెక్టు పనిలో ఉన్నాడేమో అని భావించేవాడిని. “గ్యారేజిల్లో, ఫౌండ్రిల్లో పనిచేసే గలీజు కొడుకులు సాయంకాలం పనులు అదరగొట్టుకుని ‘నీట్’గా డ్రస్’ చేసుకుని హిందూ మహిళలకు ‘లైన్’ వేస్తా ఉంటారు. మనవాళ్ళు జరుపుకునే పండగలకు, సంతలకు, షాపింగ్ల దగ్గర మాటేసి మన ఆడాళ్ళను దారికి తెచ్చుకోవడానికి చూస్తుంటారు”అని శాఖల్లో చెప్పేవాళ్ళు. మన ఆడవాళ్ళు వాళ్ళను చూసి మోజు పడతారని అనుకుంటున్నారు అనే చర్చ వచ్చింది. ఒకసారి మా శాఖలో.

అప్పుడే వృద్ధిలోకి వస్తున్న ఒక యువ నాయకుడు ఏం సమాధానం చెప్పాడంటే ముస్లిమ్లు మాంసాహారులు, హిందువులు శాఖాహారులు, మాంసం తినేవాళ్ళలో ధాతుపుష్టి జాస్తిగా ఉంటుంది. ఆకులు, అలములు తినే శాఖాహారుల్లో లైంగిక కోర్కెలు చచ్చపడిపోతాయి. అదీ కారణం అన్నాడు. ఒకప్పుడు సంఘ్ పరివార్ తరఫున న్యాయవాదిగా పనిచేసిన ఓ పెద్ద మనిషయితే సాయిబులు ‘సున్తీ చేయించుకుంటారు. అందుకే మన ఆడాళ్ళు వాళ్ళంటే పడి చస్తారు’ అని ముతగ్గా వ్యాఖ్యానించాడు. ఈ గోలంతా అప్పట్లో ఆ వయసులో నాకు అంతగా బోధపడలేదు. కానీ శాఖలో నూరిపోసే ఇలాంటి విషప్రచారాలు అప్పుడే వివసిస్తున్న కౌమార ఆలోచనల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి అనేది మాత్రం నాకు కాలక్రమంలో అర్థమయ్యింది.

హిందూ మహిళల మీద ముస్లిమ్ పురుషులు పన్నే ఉచ్చులను ఎలా ఎదుర్కోవాలి అని శాఖలో చర్చలు జరిగేవి. హిందువులు కూడా ముస్లింలకు మల్లే వాళ్ళ ఆడవాళ్ళకు ఉచ్చులు పన్నాలి. ముస్లిం మహిళలను అనుభవిస్తే వంద గోవులను మేపినంత పుణ్యం వస్తుంది. స్వర్గలోకం వ్యాప్తిస్తుంది అని ప్రచారం చేసి హిందువులను ప్రలోభపెట్టాలి, ముస్లిం యువతులను ప్రేమలోకి దించి పెళ్ళి చేసుకొని వాళ్ళు మతం మార్చుకునేలా చేసిన యువకులకు సముచిత పారితోషకాలు ప్రకటించాలి అని ఈ చర్చల్లో ప్రతివాదనలు వచ్చేవి.

ఇప్పుడు లవ్- జిహాద్ అనేది మీడియాలో ప్రముఖ వార్తాంశంగా మారిపోయింది గనుక నేనీ విషయలన్నీ ప్రస్థావిస్తున్నా. నా చిన్నప్పటికీ ఇప్పటికీ సంఘ్ పరివార్ ప్రాపంచిక దృక్పధం ఏం మారలేదు. అదే మొరటు వెకిలి ప్రచారం కొనసాగుతుంది. రెండు మతాల మధ్యన చిచ్చురేపే విష ప్రచార కధనాలు వాట్సప్లో డ్రైనేజీ మాదిరి పొంగిపొర్లుతూనే ఉన్నాయి.

నాకు తెలిసీ ప్రేమించడం, ఆ ప్రేమను సఫలం చేసుకోవడం, నిలబెట్టుకోవడమే పెద్ద యుద్ధం. ఇద్దరు మనుషులను, రెండు వ్యక్తిత్వాలను కలిపే ప్రేమ వంటి సున్నిత భావాన్ని కూడా మత విద్వేష వ్యాపక వ్యాపారస్థులు విషపూరితం చేసేసారు. కులం మతం, ప్రాంతం, భాష వంటి అంతరాలను, అడ్డుగోడలను అధిగమించి ఇద్దరు వ్యక్తులను కలిపేది ప్రేమ. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మనుషులు ప్రేమలో పడుతూనే ఉంటారు. అటువంటి ప్రేమైక భావనల మీద నైతిక పోలీసు జులం చలాయించాలని చూస్తున్న సంఘ్ పరివార్ శక్తులు అంతిమంగా ఓటమి చవి చూస్తాయి. ఇది తథ్యం.

లవ్-జిహాద్లో నేను ఒక పావును కాకుండా మా కుటుంబ కట్టుబాట్లు నన్ను కాపాడాయి. నేను పుట్టగానే నాకు ఎవరిని ఇచ్చి పెళ్ళి చెయ్యాలో నిర్ణయించేసారు. నాకుబాల్యంలోనే వివాహం చేసేచారు, యుక్త వయస్సు వచ్చాక నేను నా భార్యను కాపురానికి తీసుకువచ్చి సంతోషకరమైన జీవితం గడుపుతున్నాను. అప్పుడప్పుడూ నా మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు. ‘నువ్వెప్పుడైన ప్రేమలో పడ్డావా’ అని నేను ప్రేమలో పడడం ఏమిటి ప్రేమనే పెళ్ళాడితేనూ’ అని సమాధానం చెప్పేవాడిని. నా భార్య పేరు ‘ప్రేమ్’. ఇరవై ఏడేళ్ళ అన్యోన్య దాంపత్యం మాది. రపేమ నా సహధర్మచారిణి కాదు, నా జీవిత భాగస్వామి. మావి వేర్వేరు ప్రపంచాలు. నేను భుజానా సంచి తగిలించుకుని, ఊళ్ళ మీద పడి తిరుగుతూ నాజాతిని చైతన్యం చేసే పనిలో ఉంటుంటాను. తను మాకు ఉన్న కొద్దిపాటు వ్యవసాయం, పశుపోషణలను సంభాళించుకుంటూ మా ఇల్లు నిలబెట్టే నిట్టాడి మాదిరి వ్యవహరిస్తూ ఉంటుంది.

ఇనేళ్ళ మా సంసారంలో మేం ఒకరినొకరం ఒక మాట అని ఎరుగం. మూడు పొద్దులూ ఒకరి కొకరం ‘ఐ లవ్యూ’ అని చెప్పుకుని ఎరగం. అలానే తను ఏనాడూ, నా ఖర్మానికి దొరికావ్’ అన్న పాపాన పోలేదు. మా మధ్య అనుబంధం మాటలకు అందనిది. మాకు నలుగురు పిల్లలు అశోక్, మమత, విమల, లలిత్, మేవూ, మా బిడ్డలు, మా తల్లిదండ్రులు – ఇదీ మా కుటుంబం. నా ప్రతి అడుగు వెనుకా నా కుటుంబం ప్రోత్సాహం ఉంది. వాళ్ళ అండదండలు ఉన్నాయి. నా కుటుంబం గనుక నాకు వెన్నుదన్నుగా నిలబడకపోయి ఉంటే నేనీ రోజున ఈ స్థాయిలో సామాజిక అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతూ ఉండేవాడిని కాదు.

నా జీవిత భాగస్వామికి అక్షర జ్ఞానం లేదు. తను వీధిబడి మొహం కూడా చూడలేదు. అయినా మా ఇంటిని ఒక కమ్మని కలలా నడిపిస్తుంది. మహాజాలి గుండె కల మనిషి, చదువుకోకపోయినా ఆధునిక ఆలోచనలను ఇట్టే అంది పుచ్చుకుంటుంది. నేను చేసే పని పైసా ప్రతిఫలం లేనిది అయినా ఏనాడూ నాకు అడ్డు చెప్పలేదు. తను ఏ స్త్రీ వాద సంఘంలో భాగస్వామి కాదు, ఏ స్త్రీ వాద సాహిత్యమూ చదవలేదు కానీ తనలో బలమైన స్త్రీవాద ఆలోచనలు ఉన్నాయి. దళితులపై అత్యాచారాలు జరిగిన, మంత్రగత్తెల పేరిట దళిత మహిళలపై దాడులు జరిగినా వాటిని నిరసిస్తూ జరిగే ఊరేగింపులలోగానీ, ఉద్యమాలలో గానీ ముందు పీఠాన నిలబడుతుంది. మా జీవితాల్లో కొత్త అర్థాలు నింపింది. అత్యంత సాదాసీదాగా కనిపించే ఈ మనిషే మా చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించింది.

అయితే జీవితం ఎప్పుడూ సాదాసీదాగా గీత గీచినట్టు నడవదు. ఒడిదుడుకులు వస్తూపోతూ ఉంటాయి. ఒక్కోసారి నేను పేరుకే ఆమెకు భర్తనుగానీ, తనకంటూ నేను ఏమైనా చేసానా అన్న ఆలోచన వస్తుంటుంది. ఇద్దరం వేర్వేరు ప్రపంచాల్ని బతుకుతున్నామా అనిపిస్తుంటుంది. అంతలోనే కబీర్ పద్యపాదం ‘ధాయ్ ఆఖర్ ప్రేమ్కా’ గుర్తుకొస్తుంది. మా ప్రేమ అన్ని పరీక్షలను తట్టుకుని నిలబడింది. జీవితంలో ఎవరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో చెప్పలేం. కానీ నా జీవితంలోకి ‘ప్రేమ్’ రావడం నా అదృష్టం అనే నే నమ్ముతాను. ప్రేమ-జీవితం ఏకపద బంధాలుగా మారిన రోజున సంఘ్ పరివార్ శక్తులు చలామణిలోకి తెచ్చిన ‘లవ్-జిహాద్’ అనే నినాదాలు గాలికి ఎగిరిపోయే పేలపిండిలా కొట్టుకుపోతాయి. *

*****

48 దళిత చైతన్యాన్ని నీరుకార్చే కుట్రలు

Reviews

There are no reviews yet.

Be the first to review “నేనెందుకు హిందువుగా కాకుండా పోయాను”

Your email address will not be published. Required fields are marked *