పాకుడురాళ్లు pakuduraallu

450.00

భారత జ్ఞానపీఠమెక్కిన తొలి తెలుగు నవల

ఇన్నాళ్ళకిన్నాళ్ళకు తెలుగు సాహితి మళ్ళీ గద్దెనెక్కింది. ఓ చక్కని తెలుగు సాహితీ ప్రక్రియ – నవల – కో కలికితురాయి దక్కింది. 1988 తర్వాత 2013లో. సాహితీక్షేత్రంలో ప్రతి రచయితకో రచన పర్యాయపదంగా ఉండడం చూస్తుంటాం. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, కొడవటిగంటి ‘చదువు’, రావిశాస్త్రి ‘సారాకథలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, దాశరథి ‘అగ్నిధార’, ఆరుద్ర ‘త్వమేవాహం’, జాషువా ‘గబ్బిలం’, సీతాదేవి ‘మట్టిమనిషి’… ఇలా ఇలా ఎందరో ఎన్నెన్నో…

అలా రావూరి భరద్వాజ అంటే ‘పాకుడురాళ్ళు’. రచయితలు తమ అన్ని రచనల్లోనూ నూతన ఆలోచనా ధోరణులనూ, కళానైపుణ్యాలను నిబిడీకృతం చేస్తూనే ఉంటారు. అయితే ఏదో ఒక్క తమ రచనలో రచయిత తానే అంతటా తన విశ్వరూపం చూపిస్తూ తన జవసత్వాలన్నిటినీ పొందుపరిచి తానంతవరకూ సంపాదించుకున్న రచనా వైశిష్ట్యాన్నీ, పరిశీలనా నైశిత్యాన్నీ, విశ్లేషణా చాతుర్యాన్నీ పాఠకులకందిస్తాడు. పాఠకులు కూడా ఆ రచనలోని వస్తువురీత్యా కానీ, రచనా ప్రాబల్యం వల్ల కానీ-అతని అన్ని రచనల్లోకి ఈ రచననే ఆ రచయితను సమగ్రంగా ఆవిష్కరింపచేసే రచనగా భావించి పెద్దపీట వేస్తారు. ఆ రచయిత రచనల జాబితాలో ముందు వీటినినిలబెడ్తారు. ఇదిగో.. అలా సాహితీలోకం సగౌరవంగా సంభావించిందే ఈ ‘పాకుడురాళ్ళు.”

భరద్వాజగారు సమగ్ర సాహితీ మూర్తిమత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే – ఓ విశిష్ట రచనగా ‘పాకుడురాళ్ళు’ నవలనూ, రచయితనూ ఈ బహుమతికి ఎంపిక చేశారు.

రావూరి భరద్వాజ సామాన్య రచయితల మధ్య అసామాన్య రచయిత. సాధారణంగా ఏ రచయిత చూపులకూ తగలని సామాజిక కోణాలే ఈ రచయితకు వస్తువు. అలాంటి ఓ సినిమా బాపతు వస్తువుతో మలిచిన ఈ నవలకు తొలినుంచీ ప్రసిద్ధి రావడానికి కారణం ఆ నవలను నిర్వహించిన తీరు, చెప్పిన పద్ధతి. ఆయా సందర్భాలను ఆసరా చేసుకుని రచయిత విస్తరించిన భావజాలం. జనం ఓ రచయితకు జేజేలు పలకటం అంటే ఆ రచయిత తన రచనల్లో అందించిన భావజాలం పట్ల ఆకర్షితులైనందు వల్లా, ఆ భావజాలం ఆనాటి సామాజిక భావజాలం అయినందువల్లా అనే అనుకోవాలి. ఆ భావజాలం తమదిగా పాఠకులు భావించినందువల్లే అనాలి. దాన్ని వివరించటంలో భరద్వాజకు పాండిత్యలేమి బాగా సహకరించింది. ఓ సందర్భంలో కొందరు పాఠకులు శరత్ను ‘రవీంద్రుని’ గురించి అడిగారట. అందుకు శరత్- రవీంద్రుడు నాలాంటి వాళ్ళకోసం రాస్తారు. అన్నాట్ట. మరి మీరో అంటే నేను మీలాంటి వాళ్ళకోసం రాస్తాను. నాకు పాండిత్యం లేదు. అందుకని నేను సామాన్యులకర్థమవుతాను అన్నాట్ట. అలాగే భరద్వాజకు పాండిత్యం లేకపోవడం ఓ వరంగా అందివచ్చింది. తెలుగువాడు తెలుగువాడికోసం రాసిన తెలుగు రచనగా ఆయన రచన ఉంటుంది.

హాలాహలాన్ని తాను మింగుతున్నా నవ్వుతూ జీవితపోరాటంలో సైనికుడిగా ఉండాలన్న సత్యాన్ని చాప్లిన్ రుజువు చేశాడు. సామాజిక పోరాటాల్ని చేశాడు. అలానే కాలువేస్తే జారిపోయే ‘పాకుడురాళ్ళు’… జీవన పోరాట గమనాన్ని తెలిపే ఈ నవల. అందుకే ప్రతిష్ఠాత్మకమైన ‘జ్ఞానపీఠ పురస్కారం’. నిలవనీళ్ళలో ఒడ్డుకు దగ్గరగా కనబడీ కనబడకుండా ఉన్న బండరాళ్ళ మీద పాచి పేరుకునుంటుంది. సూర్యకిరణాల వెలుగు పడ్డప్పుడు ఆ పాచి తళతళా మెరుస్తూంటుంది. ఆకర్షణీయంగాఉంటుంది. ఆ రాళ్ళమీద కాలెట్టి నిలబడదామనుకున్నా అలా నిలబడి గాలమేసి చిన్న చిన్న చేపల్ని పడదామనుకుని ఎక్కినవాడు రాళ్ళమీద పాచివల్ల జారి నీళ్ళలో పడడం సహజం.

సమాజంలో ఇలాంటి ‘పాకుడురాళ్ళు’ ఉండే సందర్భాలున్న రంగాలు అనేకానేకాలు. భరద్వాజ తనకు అప్పటికి (1965) బాగా అవగాహన ఉన్న, ప్రజల్లో ఉత్సుకత ఉన్న – సినిమా రంగాన్ని వస్తువుగా తీసుకుని నవలీకరించిన సందర్భమే ఈ ‘పాకుడురాళ్ళు’. దానికే ఈ పురస్కారం. అందుకు ప్రముఖ రచయిత రావూరి భరద్వాజగారికి అభినందనలు. వారి ఈ రచనను మా ప్రచురణగా ఐదోసారి పాఠకులకందిస్తున్నాం. అందుకు వారికి కృతజ్ఞతలు.

తెలుగు భాషా సంస్కృతీ వికాస సంవత్సరంగా మన రాష్ట్ర ప్రభుత్వం 2013 ప్రకటించిన సందర్భంలో ‘ఈ పురస్కారం ఈ నవలకు రావటం తెలుగువారి సౌభాగ్యం.’ మా ప్రచురణాలయం ప్రచురణ రంగంలో అరవయ్యేళ్ళుగా కృషి చేస్తూ వక్త్రోత్సవ సంవత్సరంలో (1953-2013) ప్రవేశించిన సందర్భం కూడా ఇదే. ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం’ -“పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు’ మొదటి సంపుటానికీ, ఈ ‘జ్ఞానపీఠ పురస్కారం’ ఇప్పుడు ‘పాకుడురాళ్ళు’ అన్న మా ప్రచురణలకు రావడం మాకెంతో గర్వకారణం. రచయితలకు అభినందనలు.

ఇన్నాళ్ళుగా మా ప్రచురణాలయం కృషికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న రచయితలకూ, పాఠకులకూ, అభిమానులకూ సర్వదా కృతజ్ఞులం.

Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “పాకుడురాళ్లు pakuduraallu”

Your email address will not be published. Required fields are marked *