Description
భారతదేశం: ఉదార ప్రజాస్వామ్యం,తీవ్ర మితవాదం
రచయిత -ఐజాజ్ అహ్మద్
ధర:₹125ఇది చాల చిన్న పుస్తకం.అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన మార్క్సిస్టు మేధావి ప్రొఫెసర్. ఐజాజ్ అహ్మద్ తన సహజశైలిలో రాసిన రెండు సుదీర్ఘవ్యాసాలు, పలు వర్తమాన అంశాలపై ఆయనతో జిప్సన్ జాన్, జితీష్ పిఎం లు జరిపిన ఇంటర్వ్యూ ఉన్నాయి.
నేడు భారత దేశంలో హిందూత్వ మతోన్మాదం ఎంత ప్రమాదకరంగా మారి నెత్తినెక్కి కూర్చుందో మనందరం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.ఇలాంటి అతిముఖ్యమైన పరిణామాన్ని ఐజాజ్ అహ్మద్ క్లుప్తంగా అత్యంత ప్రతిభావంతంగా వివరిస్తారు.
అంతేకాదు,ఇలాంటి అతిమితవాద ధోరణులు ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా పలు దేశాల్లో గమనిస్తామని, దీనికి అంతర్జాతీయ నేపధ్యం సోవియట్ యూనియన్, ఇతర కమ్యూనిస్టు దేశాల పతనం ద్వారా సమకూరిందని చెబుతారు.
ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడమే కాకుండా,అసలు రాజకీయ పరిణామాలను ఎలా పరిశీలించాలో కూడ పాఠకులు తెలుసుకుంటారు.
Reviews
There are no reviews yet.