మువ్వల సవ్వడి
₹80.00
మువ్వలు అంటేనే సవ్వడికి సంకేతాలు, అయితే కిల్లాడ జ్యోతి తన మెట్టినింటి పేరునే తన తొలి కవితా సంపుటికి అలంకరించి అందంగా, మౌన సవ్వడితో పాఠకుల మనో పుటలను తడిమింది. కవిత్వం అంటేనే మనసు పలికిన భావ సొగసుల ఇంద్రధనవు, ఇక్కడ జ్యోతి కవిత్వంలో మనకు అనేక వినూత్న భావాలు అగుపిస్తాయి. ఈ భావాల దారులు వేరైనా గమ్యం మాత్రం ఒకటే..!!
వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, అమ్మ భాషపై మమకారం కొద్దీ ప్రవృత్తిగా సాహితీ సేద్యం చేస్తున్న మువ్వల జ్యోతి ఆకాంక్ష చూస్తే తెలుగు భాషకు పెరుగుతున్న ఆదరణ అర్థం అవుతుంది. సభ్య సమాజం పట్ల కవయిత్రికి గల బాధ్యత తెలుస్తుంది. కవయిత్రి తన మనో సరస్సులోని భావనల అలజడులను కవితా తరంగాల గుండా దరి చేర్చడానికి కేవలం భావ ధైర్ఘ్యాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు తప్ప భావానికి సొగసులు పులిమే ఇంపైన కవిత్వ బాణీలకోసం ఎదురు చూడలేదు. అలాగని జ్యోతి మువ్వల కవిత్వం అంతా పలుచనైనది అనలేం..!! అక్కడక్కడ వాడైన పదాల శరసంధానంతో తనలోని ధర్మాగ్రహాన్ని వెల్లడించారు.
నేటి మనుషులలోని అలసత్వం, బాధ్యతారాహిత్యం, మనిషితనాన్ని ఎలా చంపేస్తుందో జీవచ్ఛవం కవితలో అద్భుతంగా వెల్లడించి అందరిని ఆలోచింపజేస్తుంది, ఎవరో వస్తారులే !! నాకెందుకు అనే భావన మనిషిలోని మానవత్వాన్ని మంట గలిపి పరాన్నజీవిగా మార్చేస్తుంది, సమాజ నిస్సహాయ స్థితే మృగాలకు ఊపిరినిచ్చింది, అక్రమాలకు అంకురార్పణ చేసింది.. అంటూ నేటి సమాజంలోని అన్యాయాలకు అసలు కారణాలు ఏమిటో బహిరంగం చేసింది కవయిత్రి.
ఇదే దారిన నడిచిన మెరుగైన మనిషి తత్వం, మానవత్వమే అభిమతం వంటి కవితలు కనిపిస్తాయి. తనదైన స్త్రీతత్వపు ఎజెండాతో కూడా కొన్ని కవితలు అల్లుకుంది, కానీ ఎక్కడ మూస బాణీల స్త్రీవాదపు వాసనలు లేకుండా చక్కటి స్త్రీ చైతన్య సందేశ కాంతులు కనువిందు చేసాయి. కవయిత్రి స్త్రీ సౌభాగ్యంకు కొత్త నిర్వచనం ఇస్తూ స్త్రీవాద కవయిత్రులనే ఆలోచింపచేస్తుంది. కన్నవారి ఇంట కలువగా ప్రేమాభిమానాలను తోడబుట్టిన వాళ్ళ ఆదరణ అనుబంధాలను పెనవేసుకుని…. అంటూ అత్తవారింట అందరి తలలో నాలుకగా, పుట్టినింట మెట్టినింట గౌరవాలు కాపాడుతూ భర్త కంటి కనుపాపగా సాగిపోయే ప్రతి మహిళ జీవితం అసలైన సౌభాగ్యం అంటూ…. నినదించడంలో కవయిత్రి విశాల హృదయం ఆవిష్కరించబడుతుంది.
కేవలం మానవ సంబంధాలకే పరిమితం కాకుండా సమాజ స్థితిగతులు, రైతన్నల కడగండ్లు, కరోనా కష్టాలు, ఆధునిక విద్య వెతలు, పర్యావరణం, వంటి సామాజికపరమైన వస్తు కవితలు, మనో సవ్వడుల మనోహర కవితా సుమాలు కూడా ఇందులో చవి చూడవచ్చు, అధిక భాగం అతివలే కవితా వస్తువులుగా వెలువరించిన ఈ కవన ‘మువ్వల సవ్వడి’ మగువలకు నిండైన ఆత్మస్థైర్యం, నిజమైన భరోసాని అందిస్తుంది అనడంలో అక్షర సత్యం నిండి ఉంది, 87 కవన అందెలతో అలంకరించిన ఈ మువ్వల కవితా సవ్వడి కవితా ప్రియులకు అనిర్వచనీయమైన మధురానుభూతి అందిస్తుంది.
మువ్వల సవ్వడి (కవిత్వం)
పేజీలు 120, వెల రూ. 80
Description
మువ్వలు అంటేనే సవ్వడికి సంకేతాలు, అ్త్రీవాదపు వాసనలు లేకుండా చక్కటి స్త్రీ చైతన్య సందేశ కాంతులు కనువిందు చేసాయి. కవయిత్రి స్త్రీ సౌభాగ్యంకు కొత్త నిర్వచనం ఇస్తూ స్త్రీవాద కవయిత్రులనే ఆలోచింపచేస్తుంది. కన్నవారి ఇంట కలువగా ప్రేమాభిమానాలను తోడబుట్టిన వాళ్ళ ఆదరణ అనుబంధాలను పెనవేసుకుని…. అంటూ అత్తవారింట అందరి తలలో నాలుకగా, పుట్టినింట మెట్టినింట గౌరవాలు కాపాడుతూ భర్త కంటి కనుపాపగా సాగిపోయే ప్రతి మహిళ జీవితం అసలైన సౌభాగ్యం అంటూ…. నినదించడంలో కవయిత్రి విశాల హృదయం ఆవిష్కరించబడుతుంది.కేవలం మానవ సంబంధాలకే పరిమితం కాకుండా సమాజ స్థితిగతులు, రైతన్నల కడగండ్లు, కరోనా కష్టాలు, ఆధునిక విద్య వెతలు, పర్యావరణం, వంటి సామాజికపరమైన వస్తు కవితలు, మనో సవ్వడుల మనోహర కవితా సుమాలు కూడా ఇందులో చవి చూడవచ్చు, అధిక భాగం అతివలే కవితా వస్తువులుగా వెలువరించిన ఈ కవన ‘మువ్వల సవ్వడి’ మగువలకు నిండైన ఆత్మస్థైర్యం, నిజమైన భరోసాని అందిస్తుంది అనడంలో అక్షర సత్యం నిండి ఉంది, 87 కవన అందెలతో అలంకరించిన ఈ మువ్వల కవితా సవ్వడి కవితా ప్రియులకు అనిర్వచనీయమైన మధురానుభూతి అందిస్తుంది.మువ్వల సవ్వడి (కవిత్వం)పేజీలు 120, వెల రూ. 80
Reviews
There are no reviews yet.