వర్ణ వ్యవస్థ.

120.00

7. మనుస్మృతి – వర్ణ వ్యవస్థ
(క్రీ.పూ. 300-270).

మనకు మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర నారద స్మృతుల్లాంటివి. చాలా స్మృతులున్నాయి. వీటన్నిటిలో మనుస్మృతి అత్యంత దుర్మార్గమైంది. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ధర్మమంటే ఆచారం.

పరంపరాగతమైన ఆచారాన్ని ప్రతిపాదించేదే – స్మృతి, అని సాంప్రదాయవాదులు నిర్వచిస్తారు.

ప్రతి సామాజిక దశలోనూ పాలక-పాలిత వర్గాలు తలెత్తినప్పుడు, పాలక వర్గంగా అవతరించినవారు తమ నిరంకుశాధికారాన్ని పటిష్టం చేసుకోవలసి వొచ్చినప్పుడు, పాలితుల్ని తమ అధికారం కింద అణచి వుంచవలసి వొచ్చినప్పుడు, ఆ పనిని సమర్థించుకోవడం కోసం మాత్రమే, రాజకీయ-ధర్మ-శాస్త్రాలు ఉద్భవిస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రమూ, మనువు ధర్మశాస్త్రమూ యిందుకు నగ్నమైన ఉదాహరణలు.

* శాస్త్రం అవసరమేమిటి ?

“పూర్వపు గణసమాజంలో, వర్గవైరుధ్యాలు ఏమీలేవు. అందువల్ల ఒక వర్గానికి అనుకూలంగా, మరో వర్గాన్ని ఒత్తిడిచేసే చట్టాలనూ, ఒక వర్గంపై నియంతృత్వ చలాయించే చట్టాలకూ, అందుకోసం వ్రాయబడిన శాస్త్రాలకూ, నాటి గణసమాజంలో తావు లేదు. వర్గసమాజం ఏర్పడినందువల్లనే శాస్త్రాలూ వొచ్చాయి. అందువల్ల బానిస విధానమూ, బానిస రాజ్యాంగ పాలకులైన రాజులూ వచ్చినప్పుడే, శాస్త్రము కూడా వచ్చింది. అందువల్లనే, శాస్త్రము ఒత్తిడిచేసే సాధనమనీ, అణగద్రొక్కే సాధనమనీ, నిర్వచింపబడింది” (డాంగే – భారతదేశం)

ఆపస్తంభ ధర్మసూత్రాల్లో పనీ-విధి నిర్వహణా – ఇచ్ఛాపూర్వకంగా సాగేచోట శాస్త్రముండదు – అని స్పష్టంగా చెప్పబడింది. అయిష్టం వ్యతిరేకతా వున్నప్పుడే శాస్త్రం అవసరమవుతుంది. చూడండి :

“యత్ర తు ప్రీతివుపలబ్ధితః ప్రవృత్తిః న తత్రశాస్త్రం అస్తి”(412-11 ఆపస్తంబ సూత్రాలు)

*. “యస్మిన్ ప్రీతిః పురుషస్య తస్య లిస్సా
లక్షణా విభక్త త్వాత్”
(జైమిని పూర్వమీమాంస)

క్రీ.పూ. 7-5 శతాబ్దాల మధ్యకాలంలో, ఉత్తర భారతంలోని సమాజం సంధియుగంలో వున్న దశలో, మనుస్మృతి రచన జరిగి వుండవొచ్చునని చరిత్ర కారులు అభిప్రాయపడ్డారు. స్మృతి అంటే ధర్మశాస్త్రం. మనువు రాసింది గాబట్టి మనుస్మృతి అనే పేరిట చలామణిలో కొచ్చింది. ఈ మనుధర్మశాస్త్రంలో అజ్ఞాత ధర్మ శాస్త్రవేత్తలు దొంగతనంగా జొప్పించిన ప్రక్షిప్తాలు యెన్ని వున్నాయో, ఆది మధ్యాంతరహితుడైన ఆ పరమాత్మకే తెలియాలి!

మనుస్మృతి చదువుతోంటే, నాటి సాంఘిక పరిస్థితులూ, ఆచార వ్యవహారాలూ, విధి నిషేధాలూ, సమకాలీన ధర్మశాస్త్రవేత్తల అభిప్రాయాలూ మనకు లీలామాత్రంగా గోచరిస్తాయి. ఉత్తర భారతంలో నిరంకుశ రాచరికాలు వృద్ధి జెందుతూ, ఆదిమ గణ సమాజం క్షీణించిపోతోన్న దశలో, ఆ గణసమాజం ఆత్మరక్షణ కోసం చేసిన విఫల యత్నాల్ని మను ధర్మశాస్త్రం మనకు చూపుతుంది.

మనువు కాలం నాటికి, వర్ణ వ్యవస్థ సమాజంలో ఎంతో బలంగా వేళ్ళు తన్నుకొని పాతుకుపోయింది. మనుస్మృతి నాటికి సంఘంలో ధనిక దరిద్ర వర్గభేదం బాగా యేర్పడింది. ఈ కాలంలో, బ్రాహ్మల్లో వేలాది ఎకరాలున్న భూఖామందులూ, కోటికి పడగలెత్తిన వణిక్ ప్రముఖులూ వుండేవారనీ, వీరితోపాటు వ్యవసాయం లేదా యాచన ద్వారా పొట్టపోసుకొనే బీద బ్రాహ్మలూ వుండేవారనీ, మనకు జాతక కథల ద్వారా తెలుస్తోంది. అంచేత, ఈ కాలంలో వర్ణవ్యవస్థతో పాటు వర్గ విభజన సైతం తీవ్రమైంది. మనుస్మృతి కాలం నాటికే, సమాజంలో వర్ణభేదాలు స్థిరపడి సైతం తీవ్రమైంది. మనుస్మృతి కాలం నాటికే, సమాజంలో వర్ణభేదాలు స్థిరపడి పోయాయి. వైదిక సాంఘిక వ్యవస్థలో ప్రప్రధమంలో బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులనే మూడు వర్గాలు మాత్రమే వుండేవి. అనంతరం సృష్టించబడిందే శూద్రవర్ణం. వెరసి చాతుర్ వర్ణ వ్యవస్థ. ఈ వ్యవస్థను భగవంతుడే సృష్టించాడని వైదిక పురోహిత వర్గం ప్రచారంజేసింది. భగవద్గీతలోని శ్రీకృష్ణపరమాత్మ ద్వారా ఈ పచ్చి అబద్ధాన్నే చెప్పించింది. అయితే, పంచముల్ని ఏ వంచకులు సృష్టించారో వారు నేటికీ చెప్పలేదు. ఈ చాతుర్ వర్ణ వ్యవస్థలో పావురాళ్ళ గూళ్ళ లాంటి అనేకానేక అంతర్ వర్ణాలు గూడా వున్నాయి.

*. చాతుర్ వర్ణ ధర్మాలు.

బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రుల ధర్మాల్ని, మనువు ఈ విధంగా నిర్వచించాడు.

అధ్యాపన మధ్యయనం

యజనం యాజనం తధా

దానం ప్రతిగ్రహ శ్చైవ

బ్రాహ్మణానాం అకల్పయత్.

చదవడం -చదివించడం,యజ్ఞం చేయడం
దానం యివ్వడం – పుచ్చుకోవడం – ఇవి బ్రాహ్మణ ధర్మాలు.

ప్రజానాం రక్షణం దానం

ఇజ్యాధ్యయన మేవచ

విషయేష్వ నాసక్తిశ్చ

క్షత్రియస్య సమానతః

ప్రజల్ని రక్షించడం, దాన ధర్మాలు చేయడం, అగ్నిహోత్రాది యజ్ఞాలు చేయడం, వేదాలు పఠించడం, ఇంద్రియ కాంక్షలకి చిక్కు వడకుండా వుండడం.యివి క్షత్రియ ధర్మాలు.

పశూనాం రక్షణం దానం

ఇజ్యాధ్యయన మేవచ

వణిక్పధం కుసీదంచ

వైశ్యస్య కృషిమేవచ

గోరక్షణం, దానధర్మాలు చేయడం, అగ్నిహోత్రాది యజ్ఞాలు చేయడం, వేదాలు చదవడం, వాణిజ్యమూ వడ్డీ వ్యాపారం చేయడం – ఇవి వైశ్యుల ధర్మాలు. వాస్తవానికి వ్యవసాయం – పశుపాలనల్ని వైశ్యుడు ఎన్నడూ చేయలేదు. శూద్ర బానిసల్ని తొక్కిపట్టి నారదీసి, వారి చేతుల్లో యింతవేసి, గుక్కెడు గంజినీళ్ళు పోసి, వారిపై కర్రపెత్తనం చేయడమే, ఆనాడు వైశ్యుడు చేసిన పని!

ఏకమేవతు శూద్రస్య

ప్రభుః కర్మ సమాదిశత్

ఏతేషామేవ వర్ణానాం

శుశ్రూషాప్య న సూయయా.

బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులకి ఏ విధమైన అసూయా ద్వేషాల్లేకుండా సేవ… (అడ్డమైన చాకిరీ) చేయడమే శూద్రుల ధర్మం!

“శక్తే నాపిహి శూద్రేణ

నకార్యో ధన సంచయః

శూద్రోహి ధన మాసాద్యా

బ్రాహ్మణానేవ బాధతే:”

శక్తి గలవాడైనా శూద్రుడు ధనం ఆర్జించగూడదు. ఎంచేతనంటే, శూద్రుడు
ధనం సంపాదిస్తే బ్రాహ్మల్నే బాధిస్తాడు అని మనుధర్మ శాస్త్రవేత్త ఘంటాపథంగా చెప్పాడు.

“నా బ్రహ్మ క్షత్ర మృధ్నోతి

నా క్షత్రం బ్రహ్మవర్ధతే

బ్రహ్మ క్షత్రంచ సంపృక్తం

ఇహచా ముత్రవర్ధతే.”

బ్రాహ్మడు లేనిదే క్షత్రియుడు వృద్ధిజెందడు. క్షత్రియుడు లేనిదే బ్రాహ్మడికి వృద్ధిలేదు. అంచేత, ఉభయులూ కలిస్తేనే ఇహమూ పరమూ లభిస్తాయి అని గూడా
మనువు చెప్పాడు.

“నరాజ్ఞః ప్రతిగృష్ణాయా

దరాజన్య ప్రసూతితః.”

క్షత్రియుడు కాని రాజు వొద్ద నుండి దానం స్వీకరించవద్దని గూడా మనువు బ్రాహ్మణ్ణి శాసించాడు. అంటే మనువు కాలం నాటికే క్షత్రియేతర రాజరికం ఉత్తర భారతంలో అమల్లో వుందనేది నిస్సందేహమైన అంశం! ఈ విధంగా చేతిలో కత్తి వున్న క్షత్రియుడూ, శిరస్సులో కంతిరితనమూ – నోట్లో మంత్రమూ వున్న పురోహితుడూదోపిడీ దొంగలుగా మారి, సామాజిక ఉత్పత్తిలో వాటాలు సంపాయించారు. మానవ చరిత్రలో సాంఘిక దౌర్జన్యకాండ ఎక్కడైనా జరిగి వుంటే, అట్టిది మనుధర్మశాస్త్రం ప్రతిపాదించిన కిరాతనం ముందు బలాదూర్ అని చెప్పితే ఏమాత్రం అతిశయోక్తి గాదు!

* మనుస్మృతి నాటికి అమల్లోవున్న
వృత్తిపనివారు.

ఈ క్రింది వృత్తి పనివారిని మనుస్మృతి ఉటంకించాడు: చోరులు, గాయకులు, తక్ష (వడ్రంగివారు) వారుషిక (వడ్డీ వ్యాపార్లు) చికిత్సక, మృగయు (వేటగాళ్ళు) శైలూష, తున్నవాయ (కసాయివారు) కర్మార (కమ్మర్లు) నిషాద, రంగావతరక, సువర్ణకార (కంసాలులు) వేణ (పిల్లన గ్రోవులు చేసేవారు) శస్త్ర విక్రయా (ఆయుధాలు అమ్మేవారు) శ్వవాన్ (కుక్కలు పెంచేవాళ్లు) శౌబ్దిక (కల్లంగడివాళ్ళు) చేల నిర్ణేజక (నేతగాళ్లు) రంజక (అద్దకంపనివాళ్ళు) కారుక (మేదరివాళ్ళు) యిత్యాదు లుండేవారు. వీరి యిళ్ళలో ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్రాహ్మడు భోజనం చేయరాదని మనువు శాసించాడు. చికిత్సక (వైద్యులు) పుంశ్చలీ (వ్యభిచారిణి) వడ్డీ వ్యాపారి, శస్త్రవిక్రేతలు పెట్టే అన్నాన్ని మనువు మలంతో (పెంటతో) పోల్చిన విషయం ప్రత్యేకంగా గమనార్హం.

* వైద్యులపై స్మృతికర్తల దాడి.

ధర్మశాస్త్రవేత్తలచే ఆనాటి వైద్యులు ఎందుకింత హీనంగా చూడబడ్డారు? చిత్తశుద్ధీ విశాల దృక్పధమూ గలిగిన వైద్యుడు ఆచరణలో వర్ణ వ్యవస్థకి విరుద్ధంగానే వ్యవహరిస్తాడు. ఆతనికి రోగియే ప్రధానంగాని, రోగి యొక్క వర్ణం మాత్రం కాదు. స్మృతికర్తలు ప్రతిపాదించిన నియమాలకి విరుద్ధంగా, ఈ వైద్యులు వర్ణ ధర్మ అఖాతాల్ని సహజంగానే అతిక్రమించేవారు. దీనితోపాటు వైద్యవృత్తి, కర్మ సిద్ధాంతాన్ని ప్రశ్నించే స్వభావం గలిగినట్టిది. నిచ్చెనమెట్ల సాంఘిక వ్యవస్థను సమర్థించడానికి, పురోహితవర్గం ఈ కర్మసిద్ధాంతాన్ని వొక బలమైన ఆయుధంగా వినియోగించింది. హేతువిరుద్ధమైన ఈ సిద్ధాంతాన్ని నిరాకరించిన వైద్యశాస్త్రం, ప్రకృతి నియమాలపై ఆధారపడిన విజ్ఞానం మీదనే ప్రధానంగా ఆధారపడింది. అంచేత, ఈ పరిస్థితుల్లో వైద్యులకి వ్యతిరేకంగా కొరడాల్ని ఝళిపించకుండా వుండడం, ఆత్మహత్యా సదృశమే కాగలదు. కాబట్టి ప్రాచీన భారతంలోని వైద్యుల్ని, స్మృతి కర్తలు హీనంగా చూడడం అత్యంత సహజమైన విషయమే.

ఇలాంటి విపత్కర పరిస్థితులున్నా, నాటి వైద్యులు అగ్ర-అధమ వర్ణాలభేదాలకి తలవొంచి, మానవత్వానికి దూరం కాలేదు. మానవతా విలువలకి వారు ద్రోహం చేయలేదు. రోగాల్తో తీసుకొనే యావత్ బాధామయజీవులకి, వారి వృత్తి, రోగ నిదానాన్నీ మనశ్శాంతినీ కలుగజేస్తుందని వారికి తెలుసు. అంచేతనే, ప్రాచీన భారతంలోని వైద్యులు వర్ణభేదాలకి తావులేకుండా, సమాజంలోని సమస్త తరగతులకి చెందిన ప్రజలకీ చికిత్స చేశారు. ఈ విధంగా వైద్యులు ప్రవర్తించినందువల్లనే, నాటి స్మృతికర్తలు వైద్యులపై కారాలు మిరియాలు నూరి కత్తులు దూశారు. అంతేగాదు – శ్రమ చేయడమంటే పురోహితవర్గానికి ఏ మాత్రం గిట్టదు. ఎంచేతనంటే, సమస్త శారీరక శ్రమ-శూద్రులు విధిగా భావించిన నాటి పురోహిత వర్గం, కష్టపడి పని జేయడానికి సహజంగానే యిష్టపడదు. కాబట్టి, ప్రజలకి చికిత్స జేసే “నీచమైన” వైద్యవృత్తిని స్వీకరించడానికి, ఆనాడు “ఏ సత్ బ్రాహ్మడూ” సిద్ధపడలేదు. ఇందువల్లనే, మనువు తన ధర్మశాస్త్రంలో అధమవర్ణాల వారికే, వైద్య వృత్తిని పరిమితం జేయాలని ఆంక్షలు విధించాడు. “ఎవరు వైద్యవృత్తి ద్వారా జీవనోపాది గడుపుకొంటారో, వారు బ్రాహ్మలుగా పరిగణింపబడ జాలరు” అని స్మృతి కర్తయైన వసిష్ఠుడు సైతం ఘంటాపథంగా చెప్పాడు. (Debiprasad Chattopadhyaya Science and So- ciety in Ancient India)

*. మనుధర్మశాస్త్రం : వర్ణ ద్వేషం.

హిందూ పురోహిత వర్గం యొక్క కిరాతకత్వానికి, మనుధర్మశాస్త్రం పతాక సంకేతం. చూడండి ఈ శ్లోకాలు :

శూద్రులు స్మృతి చదవరాదు! (మనుస్మృతి -2 వ అధ్యాయం 16వ శ్లోకం)

శూద్రులను నీచమైన పేర్లతో పిలవాలి. (2వ అధ్యా. 31వ శ్లోకం) (అంటే కోటాయ్-వెంకాయ్-పుల్లాయ్-ఎల్లాయ్ అని పిలవాలి)

ఆపదలో నైనా బ్రాహ్మణ్ణి కొట్టరాదు. (4వ అధ్యా. – 165 నుండి 169 వశ్లోకం)

శూద్రుడు బ్రాహ్మణ్ణి తిట్టినప్పుడు – వాని నాలికనూ, కొట్టిన చేతినీ, తన్నిన కాలునూ నరకాలి (8వ అధ్యాయం. 270వ శ్లోకం. 9వ అధ్యా. 248 వ శ్లోకం)

బ్రాహ్మడి చెంత కూర్చున్న శూద్రుని పిర్రలు కోయాలి. లేదా వీపుపై వాతలు పెట్టాలి. (8వ అధ్యాయం. 281వ శ్లోకం)

బ్రాహ్మడి ప్రక్కన శూద్రుడు అపానవాయువు వదిలితే (పిత్తితే) వాని గుదమును కోయాలి. (8వ అధా – 283 శ్లోకం)

అగ్రవర్ణాల స్త్రీలతో శూద్రుడు సంభోగిస్తే, వాడి లింగం కోయాలి; లేదానిండు ప్రాణంతోవాణ్ణి చాపలో చుట్టి అమాంతం తగలబెట్టాలి. (8వ అధ్యా. – 366 నుండి 377 శ్లోకం వరకు)

అగ్రవర్ణాల స్త్రీలతో బ్రాహ్మడు వ్యభిచరిస్తే, వాడి గుండు గొరగాలి, లేదా డబ్బు యిచ్చి వెళ్ళగొట్టాలి. (8వ అధ్యా. – 379 నుండి 380వ శ్లోకం)

Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “వర్ణ వ్యవస్థ.”

Your email address will not be published. Required fields are marked *