Description
భారతదేశంలో సాంస్కృతిక విప్లవ యోధురాలు . స్త్రీలకు దళితులకు మొదటి పాఠశాల నిర్మించిన విద్యా ప్రయోగ కర్త . మహాత్మా పూలే సహచరిణి మానవతా శిఖరం బౌద్ధ జీవన వ్యక్తిత్వ నిర్మాత శ్రీ లోకానికి మని దీపం సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను మహాకవి ఆధునిక సాంస్కృతిక విప్లవయోధుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు 92వ గ్రంథంగా అత్యంత పరిశోధనలతో రచించారు ఈ రచన కోసం ఆయన ఒక దశాబ్దం కృషిచేసి అనేక గ్రంథాలను చరిత్రలను తత్వశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాన్ని పౌరాణిక గ్రంథాలను మనస్ఫూర్తి పరాశర శృతి సంస్కృతంలోనివి ఆంగ్లభాషలోనివి మరాఠ భాషలోనివి హిందీ భాషలోనివి పరిశోధించి మన తెలుగులో సరళ భాషలో బృహద్ గ్రంధాన్ని సచిత్రంగా మనకు అందించారు ఈ గ్రంథం మనకు చారిత్రక అవగాహనను సాంస్కృతిక పరిణామ శీలతను స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తిని తప్పక తప్పక కలిగిస్తుందని నమ్ముతున్నాం ఈ గ్రంథం అన్ని భాషల్లోకి అనువదించబడుతుంది ఈ గ్రంథం అందరి చేతుల్లోకి అన్ని గ్రంథాలయాల్లోకి వెళ్ళవలసిన గ్రంథం ఈ గ్రంథం పట్టణం వల్ల భారతదేశంలో స్త్రీ విముక్తి బాట దేదీప్యమానం అవుతుంది డాక్టర్ కత్తి పద్మారావు గారు ఈ గ్రంథంలో సావిత్రిబాయి పూలతో పాటు మహాత్మా పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు స్త్రీ దళిత బహుజన విముక్తికి చేసిన పోరాటాలను కూడా అన్వేయించి సమన్వయించి రాశారు లోకాయుక్త పబ్లికేషన్ ఇప్పటివరకు వెలువరించే గ్రంథాలను పఠనం చేసి.ప్రజలు ఇచ్చినట్టే ఈ గ్రంథాన్ని కూడా స్వీకరిస్తారని ఆశిస్తున్నామని తెలియజేస్తున్నాము.
Reviews
There are no reviews yet.