Description
కనీస ప్రమాణాలు పాటించని క్వారీలకు అనుమతులివ్వడం ద్వారా జరుగుతున్న విధ్వంసానికి అంతే లేదు. జీవన విధ్వంసం, సాంస్కృతిక-పురాతన కట్టడాల విధ్వంసం, పర్యావరణ విధ్వంసంలతో జన జీవితం అల్లకల్లోల మవుతోంది. కార్పొరేట్ల దురాశకి ప్రభుత్వం అండ తోడై జనం నిర్వాసితులౌతున్నారు. మైనింగ్ మాఫియాల ఆగడాలకి రాజ్యహింస కూడా తోడై ప్రజల మనుగడే ప్రశ్నార్థకమౌతోంది. నేల విధ్వంసం, నీరు వాయు కాలుష్యం, ప్రజల స్థానభ్రంశం, పర్యావరణ వ్యవస్థల నాశనం, భూగర్భజలాలు అడుగంటిపోవడం వంటి సమస్యల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.
ఈ విధ్వంసం కరీంనగర్లో ఒక ప్రాంతంలో ఎలా ప్రారంభమై కొనసాగిందో, అన్ని వర్గాల ప్రజలు ఎంతగా ప్రతిఘటించారో చందు రాసిన ఈ నవల రికార్డు చేసింది. ఇది ఒక్క ఆ ఊరి కథనే కాదు. మైనింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ఈ విధ్వంసం ఇంతకు మించి కూడా ఉండే ఉంటుంది. ఈ మాత్రం ప్రతిఘటన కూడా లేకపోతే మన భూమి మనకు మిగలదు. మన అడవులు మనకు మిగలవు. ఈ మైనింగ్ విధ్వంసాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుని పోరాడారో, ఆ క్రమాన్ని దృశ్యమానం చేసిందే పి.చంద్ రాసిన నవల దేవునిగుట్ట
Reviews
There are no reviews yet.