బీటలు వారిన స్వేచ్ఛ.

250.00

Category:

Description

బీటలు వారిన స్వేచ్ఛ
FRACTURED FREEDOM

కోబడ్ గాంధీ
అనువాదం – పద్మజ షా

ధర – ₹250/-…8897430904.

కూడూ,గుడ్డా,నీడా మనిషి స్వేచ్ఛకు సంబంధించిన మూడు త్రిముఖ పార్శ్వాలు. అవి మనిషి మనుగడకు అవసరమైన ఎంతో ముఖ్యమైన స్వేచ్ఛలు.

అయితే వీటితోనే మనిషి సంపూర్ణమైన మానవ జీవితాన్ని పొందడం సాధ్యం కాదు. పరిపూర్ణ మానవ జీవికకు అవసరమైన స్వేచ్ఛలు అనేకం.వివిధ పార్శ్వాలుగా ఉండే స్వేచ్ఛలతో నిండైనా జీవితం వైపు సాగడమన్నది సాపేక్షమైన ఒక క్రమం.

కానీ రాజ్య అభీష్టంతో విభేదించిన లేక దానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నా తనకుండ వలసిన సాపేక్ష స్వేచ్ఛ కూడా వ్యక్తికి దూరమైపోతుంది. అది ఎలానో అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యమే ‘బీటలు వారిన స్వేచ్ఛ.’

తన సామాజిక,ఆర్థిక,వైజ్ఞానిక నేపథ్యాన్ని కాదనుకొని అధోఃజగత్తు సహోదరుల కొరకు నాలుగు దశాబ్దాలుగా శ్రమించిన వ్యక్తి కృషి ఏవిధమైన అభినందలు అందుకోలేదు. పైగా అలాంటి నిస్వార్ధ సేవలు అందించిన వ్యక్తి జీవితం నిష్కారణంగా దశాబ్ద కాలం పాటు జైలు పాలైంది.

అమానుషంగా అవమానకరమైన జైలు జీవితాన్ని దాదాపు పది సంవత్సరాలు గడిపి నిరపరాధిగా బయటపడిన సామాజిక మేథోజీవీ కోబడ్ గాంధీ రాజకీయ జ్ఞాపకాల దొంతరే ఈ గ్రంథం.

స్వేచ్ఛ కొరకు పరితపించే ప్రతి ఒక్కరూ అవశ్యంగా చదవవలసిన పుస్తకమిది.