Description
1939 లో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం, దాదాపు 6 సంవత్సరాలు కొనసాగింది. ఈ యుద్ధంలో సుమారు 7 కోట్ల మంది వీర మరణం పొందారు. ఇందులో స్త్రీలు ఎలా పాల్గొన్నారు, యుద్ధం గురించి అసలు వాళ్ల అవగాహన ఏంటి? ఏ పరిస్థితులు వాళ్లని యుద్ధం లో చేరడానికి ప్రేరేపించాయి? అనేది చాలా వివరంగా వివరించారు రచయిత్రి ఎస్.అలెక్సియేవిచ్. ఆ యుద్ధం లో పాల్గొన్న చాలా మంది అమ్మాయిలు 15,16 సంవత్సరాల వయస్సు వారే. వారికి వారి కుటుంబ సభ్యులకు తెలిసింది అల్ల మన దేశం కోసం పోరాడటం ఒక్కటే. పోరాడే శక్తి లేని వారు కనీసం ఆ సైనికులకు బట్టలు పిండుతూ, బ్రెడ్డు కాలుస్తూ అయినా తమ వంతు సహకారం అందించారు. చాలా మంది ఆడపిల్లలు నర్షింగ్ కోర్స్ కేవలం యుద్ధం లో చేరడానికి చదివారు. వారి తండ్రుల ప్రాణాలు తీసిన శత్రు సైన్యాన్ని చంపడమే వీళ్ల ద్యేయం. అందుకు వారి వయస్సు, వారి శరీర ఆకృతీ, బలం సరిపోతుందా లేదా అనే ఆలోచన కూడా లేకుండా యుద్ధం లో చేరి వీరత్వం చూపారు. అక్కడ తోటి మగ వారి నుంచి హేళనలు, అవమానాలు ఎదురుకున్న వారే వీరు కూడా. కానీ ఎక్కడ క్రుంగి పోలేదు, వాళ్లన్ని హేళన చేసిన నోర్లే క్షమాపణలు అడిగే లా పోరాడి తమ వీరత్వాన్ని చూపారు. ఈ కథనం లో రచయిత్రి ఆ చిన్న చిన్న అమ్మాయిలు ఆ పరిస్థితులు, ఆ గాయాలు, చచ్చిన శవాలు, తెగి పడిన సైనికుల శరీర అవయవాలు చూసి వారి మానసిక పరిస్థితి ఎలా స్పందించింది, ఆ పరిస్థితుల నుండి తమని తాము ఎలా దృడంగా తయారు చేసుకున్నారు అన్నది చక్కగా వివరించారు. చదవటం మొదలు పెట్టాక అంతగా ఆసక్తికరంగా అనిపించకపోయినా, చదివే కొద్ది వారి మానసిక మార్పులు నన్ను పుస్తకం మొత్తం పూర్తి చేసేలా ప్రేరేపించాయి. ఒక మంచి వీర గాధలు, అది ఆడవారి గురించి చదవటం చాలా తృప్తి ని ఇచ్చింది
వీలు అయినా వారు తప్పక చదవండి. చిన్న చిన్న సంఘటనల కు క్రుంగి పోకుండా మనల్ని మనం ఎలా పరివర్తన చేసుకోవాలి అనేది బాగా అర్థం అవుతుంది
మీ
తనూజ వెంకట్
Reviews
There are no reviews yet.