సైన్స్ అభివృద్ధి. science abhivruddi

200.00

సైన్స్ అభివృద్ధి.

ఈ భూమ్మీద అత్యంత తెలివైన జీవ జాతి ఏది అంటే ‘హోమో సెపియన్స్’ అని ఒక జీవశాస్త్రవేత్త వెంటనే సమాధానం చెబుతాడు. మానవ జాతిని విజ్ఞాన శాస్త్ర పరిభాషలో ఆ పేరుతో పిలుస్తారు. హోమో సెపియన్స్ అంటే తెలివైన జీవులని అర్ధం. ఇంద్రియజ్ఞానాల విషయంలో ప్రకృతిలోని కొన్ని జీవులకు మనిషిని మించిన జ్ఞానం ఉంటుంది. ఉదాహరణకు గద్దలకు దృష్టి జ్ఞానం మనిషికన్నా ఎక్కువ. కుక్కలకు వాసన చూసే జ్ఞానం ఎక్కువ. కాని వీటిలో ఏ జీవిలోనూ లేని జ్ఞానం మనిషిలో ఉంది. అదే ఆలోచనా జ్ఞానం. ఆలోచనా జ్ఞానమే మనిషిని ఇతర జంతువులనుండి వేరుచేస్తోంది. విజ్ఞానం అనే నావలో ప్రయాణిస్తూ మానవుడు విశ్వాంతరాళను జయిస్తున్నాడు. సముద్రపు అగాథాల్లోకి పయనిస్తున్నాడు. భూమి పొరలను ఛేదిస్తున్నాడు. అడవులూ, నదీనదాలను అదుపులోకి తెచ్చుకుంటున్నాడు.

నిజమే కాని ఇంతటి ఆలోచనాపరుడు ఒక్కోసారి ఇంత తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడేమిటి అనిపిస్తుంది? ఉదాహరణకు చూడండి:- ఇరాక్మీద యుద్ధం చేస్తున్న అమెరికా వారానికి 200 కోట్ల డాలర్లు ఆ యుద్ధం కోసం ఖర్చు చేస్తోంది.
నెలకు 800 కోట్లు, సంవత్సరానికి సుమారు ఒక 10,000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇదంతా ఒక్క ఇరాక్ లో యుద్ధానికే చేస్తున్న ఖర్చు. అమెరికా మొత్తం ఆయుధ ఖర్చు చూస్తే మనకు మతి పోతుంది. కాని ఇటీవల ఐక్యరాజ్యసమితి వేసిన అంచనా ప్రకారం 60 వర్ధమాన దేశాల్లోని 3 కోట్లమంది పిల్లలు రానున్న పదేళ్లలో నివారించదగ్గ వ్యాధుల బారిన పడి చనిపోతారు. నివారించదగిన వ్యాధులంటే అతిసారవ్యాధి, ఆట్లమ్మ (మీజిల్స్), నిమ్ము (న్యూమోనియా), మలేరియా తదితర వ్యాధులన్న మాట. ఇవి కాకుండా క్షయ (టిబి) వ్యాధివల్ల ఏటా లక్షలాది మంది పసిపిల్లలు చనిపోతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మరణాలను దాదాపు లేకుండా చేయొచ్చు. కాని ఎంతో తెలివైన మనం, మనదగ్గరున్న డబ్బును ఆయుధాలు తయారుచేయడానికి ఉపయోగిస్తున్నామే గాని ఈ పేద పిల్లల ఆరోగ్యం కాపాడ్డానికి ఉపయోగించలేకపోతున్నాము ఎందుకని? అమెరికా ఇరాక్లో యుద్ధంమీద పెట్టిన ఖర్చు ఇప్పటివరకు 6 లక్షలమంది ప్రజల ప్రాణాలు తీసింది. వీరిలో పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఆ ఖర్చులో కొద్ది భాగం ఆరోగ్యం మీద, అందునా నివారించదగ్గ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తే మొత్తం 60 దేశాల్లోనూ రానున్న పదేళ్లలో 3 కోట్లమంది పిల్లల ప్రాణాలు కాపాడబడతాయని యునిసెఫ్కు చెందిన పిల్లల ఏజెన్సీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్ గౌతమ్ చెప్పారు. అంటే ఏడాదికి సుమారు 30 లక్షల మంది పిల్లలు మృత్యువునుండి రక్షించబడతారన్నమాట. వీరిలో ఏటా ఒక కోటీ 6 లక్షల మంది పిల్లలు కేవలం అతిసార, నిమ్ము, మలేరియా, ఆట్లమ్మ వ్యాధులవల్ల చనిపోతున్నారు.

ప్రాణాలు తీస్తున్న డబ్బును ప్రాణాలు పోయడానికి ఉపయోగిస్తే అటు ఆయుధాలవల్ల చనిపోయినవారూ బతుకుతారు, ఇటు అనారోగ్యం వల్ల చనిపోయిన వారు బతుకుతారు. 2015 నాటికి ప్రపంచంలో అయిదేళ్ల లోపు పసిపిల్లల మరణాలను మూడో వంతుకు తగ్గించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ లక్ష్యాలు
ఏర్పరచుకోవడంలో ప్రపంచంలోని అన్ని దేశాలూ భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి అయ్యే ఖర్చు చాలాచాలా తక్కువ. ‘అతి తెలివైన మానవుడు ఆధునిక యుగంలో ఆయుధాలమీద చేస్తున్న మొత్తం ఖర్చుతో పోలిస్తే ఇది సముద్రంలో మరచెంబంత. ఉదాహరణకు 2015 నాటికి 60 పేద దేశాల్లోని పిల్లల మరణాలను మూడోవంతుకు తగ్గించడానికి 2005 – 2015 మధ్య పదేళ్లకు గాను 700 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. కాని ఖర్చు చేస్తున్నది మాత్రం చాలా తక్కువ. ఇప్పటి పద్ధతిలో వెళితే మరో వందేళ్ల తరువాత అంటే 2115 నాటికి కూడా ఐరాస నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేమని గౌతమ్ చెప్పారు. కాని అమెరికా ఇటీవల కొత్తగా రూపొందించిన ఒక్క బి-2 యుద్ధవిమానానికి చేసిన ఖర్చు 220 కోట్ల డాలర్లు. అంటే మనుషుల ప్రాణాలు తీసే బి-2 బాంబరు విమానాలు మూడింటిని తగించుకుంటే 3 కోట్లమంది పిల్లలకు ప్రాణాలు పోయవచ్చు. అమెరికా ఆయుధ సంపత్తిలో ఉన్న వందలాది యుద్ధ నౌకల్లో నిమిట్జ్ తరగతి యుద్ధనౌక తయారీకి 450 కోట్ల డాలర్లు ఖర్చవుతుంది. ఒక్క యుద్ధనౌక ఖర్చుతో రెండు కోట్ల మంది పిల్లల ప్రాణాలు కాపాడవచ్చు. ఇదంతా చూస్తుంటే మనది నిజంగా తెలివైన జీవ జాతేనా అన్న అనుమానం రావడం లేదూ?

అమెరికా, బ్రిటిష్ వాళ్ల సంగతి పక్కన పెడదాం. దారిద్య్రం, అనారోగ్యం, అవిద్య తాండవిస్తున్న మన భారత్లాంటి వర్ధమాన దేశాలు కూడా కోట్ల రూపాయల డబ్బును ఆయుధాలమీద తగలేయడం ఎంతటి అజ్ఞానం. 25 కోట్లమందికి పైగా ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువజీవిస్తున్న దేశం మనది. మానవాభివృద్ధి సూచికలో 170 దేశాల్లో మనం 127వ స్థానంలో ఉన్నాం. ప్రపంచ గుడ్డి వాళ్లలో అత్యధికులు మన దేశంలోనే ఉన్నారు. కష్టు వాళ్లలో అత్యధికులు ఇక్కడే ఉన్నారు. 6 కోట్ల మంది ఫ్లోరోసిస్తో బాధపడుతున్నారు. మరి ఇవన్నీ ఇలా ఉండగా మనలాంటి దేశం అణ్వాయుధాలు తయారుచేసి సైన్యంలో కొనసాగించడానికి ఏటా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఆలోచనా జ్ఞానంతో చేసే పనేనా?

ఇదంతా చూస్తుంటే మానవజాతి అభివృద్ధిలో ఎక్కడో అపసృతి దొర్లినట్లు కనిపించడం లేదూ? విజ్ఞానం పెరిగిందిగాని విజ్ఞత లోపించింది. అజ్ఞానం కన్నా విజ్ఞత లేని విజ్ఞానం మరింత ప్రమాదకరం. ఈ విషయం చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైంది. నాజీ నియంత హిట్లర్ చేతిలోని వి2 రాకెట్లు యూరప్ లో సృష్టించిన విధ్వంసం, అమెరికాపాలకుల చేతిలోని అణుబాంబులు జపాన్లో సృష్టించిన మారణహోమం, ఇప్పుడు తాజాగా ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్లలో జరుగుతున్న మారణహోమం ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నాయో వాటిని అంతగా విజ్ఞతతో ఉపయోగించుకోవడం నేర్చుకున్నప్పుడే మానవజాతి నిజమైన ‘హోమో సెపియన్స్’ (తెలివైన జీవులు) అవుతుంది. అందువల్ల విజ్ఞానాభివృద్ధిలో విజ్ఞత ప్రవేశపెట్టడం ఇప్పుడు కావాలి.

Category:

Description

సైన్స్ అభివృద్ధి.

ఈ భూమ్మీద అత్యంత తెలివైన జీవ జాతి ఏది అంటే ‘హోమో సెపియన్స్’ అని ఒక జీవశాస్త్రవేత్త వెంటనే సమాధానం చెబుతాడు. మానవ జాతిని విజ్ఞాన శాస్త్ర పరిభాషలో ఆ పేరుతో పిలుస్తారు. హోమో సెపియన్స్ అంటే తెలివైన జీవులని అర్ధం. ఇంద్రియజ్ఞానాల విషయంలో ప్రకృతిలోని కొన్ని జీవులకు మనిషిని మించిన జ్ఞానం ఉంటుంది. ఉదాహరణకు గద్దలకు దృష్టి జ్ఞానం మనిషికన్నా ఎక్కువ. కుక్కలకు వాసన చూసే జ్ఞానం ఎక్కువ. కాని వీటిలో ఏ జీవిలోనూ లేని జ్ఞానం మనిషిలో ఉంది. అదే ఆలోచనా జ్ఞానం. ఆలోచనా జ్ఞానమే మనిషిని ఇతర జంతువులనుండి వేరుచేస్తోంది. విజ్ఞానం అనే నావలో ప్రయాణిస్తూ మానవుడు విశ్వాంతరాళను జయిస్తున్నాడు. సముద్రపు అగాథాల్లోకి పయనిస్తున్నాడు. భూమి పొరలను ఛేదిస్తున్నాడు. అడవులూ, నదీనదాలను అదుపులోకి తెచ్చుకుంటున్నాడు.

నిజమే కాని ఇంతటి ఆలోచనాపరుడు ఒక్కోసారి ఇంత తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడేమిటి అనిపిస్తుంది? ఉదాహరణకు చూడండి:- ఇరాక్మీద యుద్ధం చేస్తున్న అమెరికా వారానికి 200 కోట్ల డాలర్లు ఆ యుద్ధం కోసం ఖర్చు చేస్తోంది.
నెలకు 800 కోట్లు, సంవత్సరానికి సుమారు ఒక 10,000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇదంతా ఒక్క ఇరాక్ లో యుద్ధానికే చేస్తున్న ఖర్చు. అమెరికా మొత్తం ఆయుధ ఖర్చు చూస్తే మనకు మతి పోతుంది. కాని ఇటీవల ఐక్యరాజ్యసమితి వేసిన అంచనా ప్రకారం 60 వర్ధమాన దేశాల్లోని 3 కోట్లమంది పిల్లలు రానున్న పదేళ్లలో నివారించదగ్గ వ్యాధుల బారిన పడి చనిపోతారు. నివారించదగిన వ్యాధులంటే అతిసారవ్యాధి, ఆట్లమ్మ (మీజిల్స్), నిమ్ము (న్యూమోనియా), మలేరియా తదితర వ్యాధులన్న మాట. ఇవి కాకుండా క్షయ (టిబి) వ్యాధివల్ల ఏటా లక్షలాది మంది పసిపిల్లలు చనిపోతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మరణాలను దాదాపు లేకుండా చేయొచ్చు. కాని ఎంతో తెలివైన మనం, మనదగ్గరున్న డబ్బును ఆయుధాలు తయారుచేయడానికి ఉపయోగిస్తున్నామే గాని ఈ పేద పిల్లల ఆరోగ్యం కాపాడ్డానికి ఉపయోగించలేకపోతున్నాము ఎందుకని? అమెరికా ఇరాక్లో యుద్ధంమీద పెట్టిన ఖర్చు ఇప్పటివరకు 6 లక్షలమంది ప్రజల ప్రాణాలు తీసింది. వీరిలో పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఆ ఖర్చులో కొద్ది భాగం ఆరోగ్యం మీద, అందునా నివారించదగ్గ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తే మొత్తం 60 దేశాల్లోనూ రానున్న పదేళ్లలో 3 కోట్లమంది పిల్లల ప్రాణాలు కాపాడబడతాయని యునిసెఫ్కు చెందిన పిల్లల ఏజెన్సీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుల్ గౌతమ్ చెప్పారు. అంటే ఏడాదికి సుమారు 30 లక్షల మంది పిల్లలు మృత్యువునుండి రక్షించబడతారన్నమాట. వీరిలో ఏటా ఒక కోటీ 6 లక్షల మంది పిల్లలు కేవలం అతిసార, నిమ్ము, మలేరియా, ఆట్లమ్మ వ్యాధులవల్ల చనిపోతున్నారు.

ప్రాణాలు తీస్తున్న డబ్బును ప్రాణాలు పోయడానికి ఉపయోగిస్తే అటు ఆయుధాలవల్ల చనిపోయినవారూ బతుకుతారు, ఇటు అనారోగ్యం వల్ల చనిపోయిన వారు బతుకుతారు. 2015 నాటికి ప్రపంచంలో అయిదేళ్ల లోపు పసిపిల్లల మరణాలను మూడో వంతుకు తగ్గించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ లక్ష్యాలు
ఏర్పరచుకోవడంలో ప్రపంచంలోని అన్ని దేశాలూ భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి అయ్యే ఖర్చు చాలాచాలా తక్కువ. ‘అతి తెలివైన మానవుడు ఆధునిక యుగంలో ఆయుధాలమీద చేస్తున్న మొత్తం ఖర్చుతో పోలిస్తే ఇది సముద్రంలో మరచెంబంత. ఉదాహరణకు 2015 నాటికి 60 పేద దేశాల్లోని పిల్లల మరణాలను మూడోవంతుకు తగ్గించడానికి 2005 – 2015 మధ్య పదేళ్లకు గాను 700 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. కాని ఖర్చు చేస్తున్నది మాత్రం చాలా తక్కువ. ఇప్పటి పద్ధతిలో వెళితే మరో వందేళ్ల తరువాత అంటే 2115 నాటికి కూడా ఐరాస నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేమని గౌతమ్ చెప్పారు. కాని అమెరికా ఇటీవల కొత్తగా రూపొందించిన ఒక్క బి-2 యుద్ధవిమానానికి చేసిన ఖర్చు 220 కోట్ల డాలర్లు. అంటే మనుషుల ప్రాణాలు తీసే బి-2 బాంబరు విమానాలు మూడింటిని తగించుకుంటే 3 కోట్లమంది పిల్లలకు ప్రాణాలు పోయవచ్చు. అమెరికా ఆయుధ సంపత్తిలో ఉన్న వందలాది యుద్ధ నౌకల్లో నిమిట్జ్ తరగతి యుద్ధనౌక తయారీకి 450 కోట్ల డాలర్లు ఖర్చవుతుంది. ఒక్క యుద్ధనౌక ఖర్చుతో రెండు కోట్ల మంది పిల్లల ప్రాణాలు కాపాడవచ్చు. ఇదంతా చూస్తుంటే మనది నిజంగా తెలివైన జీవ జాతేనా అన్న అనుమానం రావడం లేదూ?

అమెరికా, బ్రిటిష్ వాళ్ల సంగతి పక్కన పెడదాం. దారిద్య్రం, అనారోగ్యం, అవిద్య తాండవిస్తున్న మన భారత్లాంటి వర్ధమాన దేశాలు కూడా కోట్ల రూపాయల డబ్బును ఆయుధాలమీద తగలేయడం ఎంతటి అజ్ఞానం. 25 కోట్లమందికి పైగా ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువజీవిస్తున్న దేశం మనది. మానవాభివృద్ధి సూచికలో 170 దేశాల్లో మనం 127వ స్థానంలో ఉన్నాం. ప్రపంచ గుడ్డి వాళ్లలో అత్యధికులు మన దేశంలోనే ఉన్నారు. కష్టు వాళ్లలో అత్యధికులు ఇక్కడే ఉన్నారు. 6 కోట్ల మంది ఫ్లోరోసిస్తో బాధపడుతున్నారు. మరి ఇవన్నీ ఇలా ఉండగా మనలాంటి దేశం అణ్వాయుధాలు తయారుచేసి సైన్యంలో కొనసాగించడానికి ఏటా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఆలోచనా జ్ఞానంతో చేసే పనేనా?

ఇదంతా చూస్తుంటే మానవజాతి అభివృద్ధిలో ఎక్కడో అపసృతి దొర్లినట్లు కనిపించడం లేదూ? విజ్ఞానం పెరిగిందిగాని విజ్ఞత లోపించింది. అజ్ఞానం కన్నా విజ్ఞత లేని విజ్ఞానం మరింత ప్రమాదకరం. ఈ విషయం చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైంది. నాజీ నియంత హిట్లర్ చేతిలోని వి2 రాకెట్లు యూరప్ లో సృష్టించిన విధ్వంసం, అమెరికాపాలకుల చేతిలోని అణుబాంబులు జపాన్లో సృష్టించిన మారణహోమం, ఇప్పుడు తాజాగా ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్లలో జరుగుతున్న మారణహోమం ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నాయో వాటిని అంతగా విజ్ఞతతో ఉపయోగించుకోవడం నేర్చుకున్నప్పుడే మానవజాతి నిజమైన ‘హోమో సెపియన్స్’ (తెలివైన జీవులు) అవుతుంది. అందువల్ల విజ్ఞానాభివృద్ధిలో విజ్ఞత ప్రవేశపెట్టడం ఇప్పుడు జరగాల్సిన పని

Reviews

There are no reviews yet.

Be the first to review “సైన్స్ అభివృద్ధి. science abhivruddi”

Your email address will not be published. Required fields are marked *